![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే పది వారాలు పూర్తిచేసుకుంది. ఎన్నో ట్విస్ట్ లు, మరెన్నో ఉల్టా పుల్టా థీమ్ లు, టాస్క్ , నామినేషన్ అంటు ప్రేక్షకులకి మంచి కిక్కు ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే ఇప్పుడు హౌస్ లో ఉన్నవారిలో నెంబర్ వన్ స్థానంలో శివాజీ ఉన్నాడు.
శివాజీ నెంబర్ వన్ లో ఉండటానికి ప్రధాన కారణాలేంటం
టే.. హౌస్ లో ప్రతీ గేమ్ ఫెయిర్ గా ఆడుతూ, తోటి హౌస్ మేట్స్ కి సపోర్ట్ ఇస్తూ అందరిని కలుపుకుపోతున్నాడు శివాజీ. ఇక హౌస్ బయట శివాజీకి అభిమానులైతే లెక్కలేనంత ఉన్నారు. శివాజీ నామినేషన్ లో ఉన్న ప్రతీసారీ అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో ఉంటున్నాడు. అయితే శివాజీ చిన్న కొడుకు రిక్కీ బయట చేసే ప్రమోషన్స్ అంతా ఇంతా కాదు. హౌస్ లో నువ్వు ఒక్క వారం కూడా ఉండలేవని శివాజీ కొడుకు రిక్కీ చెప్పాడని శివాజీ చాలాసార్లు అన్నాడు.
గతవారం జరిగిన ఫ్యామిలీ వీక్ లో భాగంగా శివాజీ పెద్ద కొడుకు వెంకట్ రావడంతో ఎమోషనల్ అయ్యాడు శివాజీ. ఆ తర్వాత కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నాక.. నువ్వు వస్తావనుకోలేదు. రిక్కీ వస్తాడని అనుకున్నా అని శివాజీ అన్నాడు. అది నాన్న ప్రేమ. మొన్న దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా స్టేజ్ మీదకి శివాజీ భార్య, కొడుకు రిక్కీ వచ్చారు. స్టేజ్ మీదకి వచ్చిన రిక్కీ.. నువ్వు అమర్ దీప్ గొడవపడుతుంటే బాగా ఎంజాయ్ చేస్తామని సరదగా నవ్వుతూ చెప్పాడు. ఇక ఇంకెప్పుడు బయటకొస్తానని అనకు. నీ నీడను కూడా నువ్వు నమ్మకని రిక్కీ అనగా.. నా నీడని నమ్ముతానని శివాజీ జోక్ చేశాడు. ఇక రిక్కీని చూసి ఎమోషనల్ అయ్యాడు. అయితే హౌస్ లోని కంటెస్టెంట్స్ కి బయట 'పీఆర్' టీమ్ ల ప్రమోషన్స్ మాములుగా లేవు. వాళ్ళకి ధీటుగా శివాజీ కొడుకు రిక్కీ కూడా కష్టపుడతున్నాడు. హౌస్ లో ఫెయిర్ గా ఆడేవాళ్ళనే ప్రేక్షకులు గెలిపిస్తారనేది నిజం.
![]() |
![]() |